Sunday, January 16, 2022

మకర సంక్రాంతి - భారత సమ్మిళితత్వం

వికీపీడియా లో ని దృశ్యం

మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఖగోళ పరివర్తన సంఘటన (మకర సంక్రమణము). 

మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణం ప్రారంభం అవుతుందనే సాధారణ నమ్మకం ఖచ్చితమైనది కాదు.
నిరంతర ఖగోళ మార్పుల కారణంగా ఇప్పుడు ఉత్తరాయణం డిసెంబర్‌లో జరుగుతుంది మరియు మకర సంక్రాంతి జనవరి మధ్యలో వస్తుంది. 

సంక్రాంతి పంట కాలం ముగింపును సూచిస్తుంది మరియు ప్రకృతి, వ్యవసాయం, మానవ సంబంధాలతో లోతైన అనుసంధాన మూలాలను కలిగి ఉన్న భారతీయ సాంప్రదాయ పండుగ కూడా.

భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియా దేశాలలో సంక్రాంతి ఉత్సవాలు రెండు నుండి నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి, వీటిలో ప్రతి రోజు విభిన్న పేర్లు మరియు ఆచారాలతో హిందువులు, సిక్కులు, బౌద్ధులు
జరుపుకుంటారు.

భారతదేశం అంతటా భిన్నత్వం మరియు ఏకత్వాన్ని ప్రతిబింబించే సంక్రాంతి వేడుకల యొక్క సారూప్య అంశాలను చూద్దాం.


భారతదేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల లోహ్రీ / భేలాఘర్ / భోగి మంటలు
చెక్క దుంగలు లేదా ఇతర ఘన-ఇంధనాల ‌మరియు ఇంట్లో పనికిరాని చెక్క వస్తువుల తో మంటలు 
వెలిగిస్తారు.
ఇది ప్రాంతీయ ఆచారాల ఆధారంగా సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయాలు, పాటలు, నృత్యాలు, ఆహార పదార్థాల తో సంక్రాంతికి ముందు జరుపుకుంటారు.

సరదా ఆటలు

పిల్లలుయువత పంజాబ్ మరియు అస్సాం ప్రాంతాలలో గ్రామాలలో ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి ట్రిక్ లేదా ట్రీట్ (యుక్తి లేదా భుక్తిఆట ఆడతారు.

ఆంధ్రాలో భోగి సాయంత్రం భోగిపళ్లు (రేగి పళ్లుతో పాటు నాణేలుపువ్వులు,  చిరుతిండ్ల ను పిల్లలపై పోస్తారు మరియు ఇతర పిల్లలు వాటిని సేకరిస్తారు.


బొమ్మల కొలువు లో పౌరాణిక, నిత్య జీవితం దృశ్యాల ను బొమ్మల రూపంలో శ్రేణులు గా అమర్చబడి ప్రదర్శిస్తారు.


గాలిపటాలు ఎగురవేయుట 

సంక్రాంతి శీతాకాలపు గాలులు గాలిపటాలు ఎగురవేయడానికి సరైన సమయం. భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో గాలిపటాల పండుగ కార్యక్రమాలు మరియు పోటీలు జరుగుతాయి. ఎగురుతున్న 
రంగురంగుల
గాలిపటాలా తో  ఆకాశం  మెరిసిపోతోంది.

మాఘి / భోగాలి బిహు / ఉత్తరాయణ్ /  తాయ్ పొంగల్ / మకర సంక్రాంతి లేదా కేవలం సంక్రాంతి
నాలుగు రోజుల పండుగలో రెండవ మరియు ప్రధాన రోజు. అనేక ప్రాంతాల్లో మేళాలు లేదా జాతరలు జరుగుతాయి. పూర్వీకులను స్మరించుకునే ఆచారాలు ,మరియు పుణ్యస్నానాలు చేస్తారు.

దానాలు
సంక్రాంతి సమయంలో దానం చేస్తారు.దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హరిదాసు , గంగిరెద్దులాట కనపడతాయి. 
హరిదాసు : తలపై అక్షయపాత్ర (గిన్నె) మోస్తూ భగవంతుడు హరి(విష్ణువు)పై పాటలు పాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రజల నుండి విరాళాలు స్వీకరిస్తారు. 
గంగిరెద్దులాట : సంగీత వాయిద్యాలు వాయించే వ్యక్తులతో అలంకరించబడిన ఎద్దు విన్యాసాలు ప్రదర్శిస్తుంది మరియు ప్రజల నుండి 
విరాళాలు స్వీకరిస్తారు.

ముగ్గులు
నేల పై చూస్తే ఆరుబయట వీధులు  వివిధ రకాల, గీతల , చుక్కల ముగ్గులు తో రంగులద్దుకుంటాయి.
దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముగ్గుల పై ఉంచిన ఆవుపేడ ముద్దను గొబ్బెమ్మ (గౌరీ దేవత)గా యువతులు ఆట పాటల తో పూజిస్తారు.

ఆహార సంప్రదాయాలు

నువ్వులు,మినపప్పు , బియ్యం, బెల్లం, కొబ్బరి, పండ్లు, డైరీ ఉత్పత్తులతో వంటకాలు తయారు చేస్తారు. సామూహిక లేదా కుటుంబ సమేత విందు చేస్తారు.

అస్సాంలోని కొన్ని గ్రామాలలో భోగాలి బిహులో సామూహికంగా చేపలు పట్టడం జరుగుతుంది. చేపలు మరియు ఇతర మాంసం విందులో ఉంటాయి.
దక్షిణాది నుండి పొంగల్ , అరిసెలు ; తూర్పు నుండి పీఠా , రసగుల్లా ; ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని నువ్వులు బెల్లం లడ్డు, ఖిచిడీ పండుగ సీజన్‌లో కొన్ని ప్రసిద్ధ వంటకాలు.

భారతీయ పండుగల సమయంలో తయారుచేసిన ఆహార పదార్థాలు సాధారణంగా కాలం ‌ను దృష్టిలో ఉంచుకుని, వాటి వినియోగంతో ఆరోగ్యంగా ఉండటానికి తయారు చేస్తారు.

జంతు క్రీడలు 
భోగాలీ బిహు / మాగ్ బిహు రోజున అస్సాం లో గేదె పోరాటాలు , తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోడి పోరాటాలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కోడి  పందాలు /  గొర్రెలు / పందుల పోరాటాలు / ఎద్దుల బండి పోటీలు జరుగుతాయి. జల్లికట్టు (ఎద్దును నియంత్రించడం) అనేది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో మట్టు పొంగల్ / కనుమ నాడు నిర్వహించబడే ఆట. ఈ కార్యకలాపాలపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయి.

మట్టు పొంగల్ / కనుమ నాలుగు రోజుల పండుగలో మూడవ రోజు, ఇది దక్షిణ భారతదేశంలో వ్యవసాయంలో వారి పాత్ర కోసం పశువులకు అంకితం చేయబడింది. పశువులను అలంకరించారు, ముఖ్యంగా ఆవులు, ఎద్దులకు అరటిపండ్లు, ప్రత్యేక భోజనం అందిస్తారు.


ప్రభ
ఆంధ్ర ప్రదేశ్ కోనసీమ ప్రాంతంలోని అనేక గ్రామాలు శివుడిని మోసే ప్రభ (రథం లాంటి నిర్మాణాలు) సామూహిక ఊరేగింపు చేసి జగ్గన తోట చేరుతాయి.

కానుమ్ పొంగల్: తమిళనాడులో కుటుంబ సమావేశాలు మరియు కలయికలు, పెళ్లి చూపులు జరుగుతాయి.
ముక్కనుమ: ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహార విందులు కొన్ని వర్గాల్లో ఆనవాయితీ. భోగి నాడు ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు ముక్కనుమ రోజున ఎత్తి వేస్తారు. ముగ్గుల రూపంలో వీధుల చివరి వరకు రథం మరియు తాడు లాగడం గీసి సంక్రాంతి పురుషుడికి వీడ్కోలు పలుకుతారు.



No comments:

Post a Comment

International Women's Day